News May 23, 2024
రీపోలింగ్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

AP: సత్తెనపల్లి, చంద్రగిరిలోని పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది. సత్తెనపల్లిలోని 236, 237, 253, 254 బూత్‌లు, చంద్రగిరిలోని 4 కేంద్రాల్లో TDP నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఏజెంట్లపై దాడులు చేశారని తెలిపారు. ఈసీ, సీఈవోతోపాటు పలువురు అధికారులు, టీడీపీ నేతలను ప్రతివాదులుగా చేర్చారు.
Similar News
News November 28, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* రోడ్ల మరమ్మతుల కోసం రూ.276 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది.
* ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ నిర్వహణలో లోపాలను పరిష్కరించడానికి CS విజయానంద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది.
* IRS అధికారి జాస్తి కృష్ణకిశోర్‌పై గతంలో CID నమోదుచేసిన అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
* వర్షాలకు ధాన్యం తడిచి రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారనే కంప్లైంట్లు వస్తే JCలదే బాధ్యత: CS విజయానంద్
News November 28, 2025
సర్పంచ్ పోస్టు@రూ.కోటి

TG: సర్పంచ్ పదవులను <<18400001>>ఏకగ్రీవంగా<<>> సొంతం చేసుకునేందుకు వేలంపాటలు జోరుగా సాగుతున్నాయి. మహబూబ్‌నగర్(D) టంకర్ గ్రామ పంచాయతీని ఓ వ్యాపారి ₹కోటికి దక్కించుకున్నారు. ఆంజనేయస్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. గద్వాల(D) కొండపల్లిలో ₹60L, గొర్లఖాన్‌దొడ్డిలో ₹57L, చింతలకుంటలో ₹38L, ముచ్చోనిపల్లిలో రూ.14.90L, ఉమిత్యాల తండాలో ₹12L చొప్పున సర్పంచ్ సీటుకు వేలంపాట పాడారు.
News November 28, 2025
4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిరసన తెలిపారు.


