News December 10, 2024

ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

image

AP: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీటిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.

Similar News

News December 25, 2025

JAN 8న హాట్‌స్టార్‌లోకి ‘వెపన్స్’

image

సూపర్‌హిట్ హాలీవుడ్ హర్రర్ మూవీ ‘వెపన్స్’ మరో OTTలో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. JAN 8 నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు జియో హాట్‌స్టార్‌ ప్రకటించింది. AUGలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కొన్ని వారాలకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లేలో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. రూ.335 కోట్లతో తీసిన హర్రర్ థ్రిల్లర్ రూ.2,400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది.

News December 25, 2025

‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రారంభించిన మోదీ.. ఏంటిది?

image

లక్నోలో(UP) ₹230 కోట్లతో, 65 ఎకరాల్లో నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారి గొప్ప ఆలోచనలు, సుపరిపాలన పాఠాలను ముందు తరాలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ప్రధాని వివరించారు. దేశ సేవ, నాయకత్వ విలువలు, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందన్నారు.

News December 25, 2025

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

image

బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయాయి. రాజ్‌బరి జిల్లాలో 29 ఏళ్ల యువకుడు అమృత్ మండల్‌ను కొట్టి చంపారు. బుధవారం రాత్రి 11 గం.కు రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి దారుణంగా దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అమృత్ దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఈ హింసకు తెగబడ్డారు. కాగా ఇటీవల <<18624742>>దీపూ చంద్రదాస్<<>> అనే హిందూ యువకుడిని కొందరు కొట్టి చంపి, తగలబెట్టిన విషయం తెలిసిందే.