News November 27, 2024

RGV ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

image

సినీ దర్శకుడు <<14719310>>రామ్ గోపాల్ వర్మ<<>> దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఒంగోలు, విశాఖ, గుంటూరులో కేసులు నమోదయ్యాయి. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తాను పరారీలో లేనని, మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని చెప్పారు.

Similar News

News November 27, 2024

కులగణన డేటాను పబ్లిక్ డొమైన్‌లో పెడతాం: పొన్నం

image

TG: పారదర్శకంగా కులగణన చేపడుతున్నామని, అది పూర్తికాగానే డేటాను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం ప్రజలతో చర్చించి సామాజిక న్యాయం అమలు చేస్తామని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం సంక్షేమ ఫలాలు పంచేందుకు స్కీమ్స్ తీసుకొస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణన దేశానికి దిక్సూచిగా నిలవబోతోందని పొన్నం అన్నారు.

News November 27, 2024

ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి

image

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్‌వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్‌‌లో జాన్ సోమవారం కన్నుమూసినట్లు ఆయన కుటుంబం ప్రకటించింది. 1912లో జన్మించిన జాన్‌ను ఈ ఏడాది APRలో వరల్డ్ ఓల్డెస్ట్ మెన్‌గా గిన్నిస్ బుక్ గుర్తించింది. టైటానిక్ ఓడ మునిగిన ఏడాదే(1912) ఆయన పుట్టడంతో ఆ విధంగానూ జాన్ ప్రాచుర్యం పొందారు. ఆయన జీవితాంతం లివర్‌పూల్ FC అభిమానిగా ఉన్నారు.

News November 27, 2024

మహారాష్ట్ర CM పేరు ప్రకటనపై ఆలస్యం.. కారణమిదే!

image

ఫలితాలొచ్చి 4రోజులు అవుతున్నా మహారాష్ట్ర CM ఎవరనేదానిపై ఉత్కంఠ వీడలేదు. నిన్న శిండే రాజీనామా చేయగా BJP అధిష్ఠానం పేరు ప్రకటిస్తుందనుకున్నా అలా జరగలేదు. మిత్రపక్షాల మధ్య విభేదాలు రావొద్దనే సమయం తీసుకుంటున్నట్లు సీనియర్ BJP నేత వెల్లడించారు. MHలో దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా CMను ఖరారు చేసే అవకాశముందని మరో నేత తెలిపారు. దేవేంద్ర ఫడణవీస్, శిండే CM కుర్చీపై ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.