News April 21, 2025

వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

AP: YCP నేత వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. భూ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ ఈ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అటు లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని CIDని ఆదేశించిన HC, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Similar News

News April 21, 2025

రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు?

image

ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి అని IMDb పేర్కొంది. పారితోషికం, ప్రాఫిట్ షేర్ (కలెక్షన్స్ బట్టి), మూవీ హక్కుల విక్రయం ద్వారా ఈ మేరకు పొందుతారని తెలిపింది. ఇది స్టార్ హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇతర దర్శకుల్లో సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు, రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.

News April 21, 2025

కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం

image

TG: రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్, ఆసిఫాబాద్, మెదక్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

News April 21, 2025

భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను మరచిపోం: పీఎం మోదీ

image

పోప్ ఫ్రాన్సిస్ మృ‌తి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారతీయుల పట్ల పోప్‌కు ఉన్న ఆప్యాయతను ఎన్నటికీ మరచిపోమని అన్నారు. ‘పోప్ ఫ్రాన్సిస్ మృతి చాలా బాధను కలిగించింది. ఈ కష్ట సమయంలో ప్రపంచ కాథలిక్ వర్గానికి నా ప్రగాఢ సంతాపం. జాలి, దయ, వినయం వంటి సుగుణాలకు ఓ ప్రతీకగా కోట్లాదిమంది హృదయాల్లో ఫ్రాన్సిస్ ఎప్పటికీ నిలిచి ఉంటారు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!