News April 1, 2025

ఒక్క మందుతో గుండెపోటు, స్ట్రోక్ దూరం!

image

గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించగల ‘లెపొడిజిరాన్’ మెడిసిన్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిని అమెరికాకు చెందిన ఎలి లిల్లీ అనే ఫార్మా సంస్థ అభివృద్ధి చేసింది. ఏడాదికి ఒక్కసారి వేసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 94శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా ఈ పరిశోధనలో 6 నెలల పాటు దీని ప్రభావం ఉన్నప్పటికీ, దుష్ప్రభావాలు కనిపించలేదు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

Similar News

News November 13, 2025

అదానీ కోసమే భూటాన్‌కు మోదీ: ప్రియాంక్ ఖర్గే

image

తన ఫ్రెండ్ అదానీకి లబ్ధి చేకూర్చేందుకే భూటన్‌లో ప్రధాని మోదీ పర్యటించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ‘ఢిల్లీలో ఉగ్రదాడితో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ భూటాన్ ఎందుకు వెళ్లారు? అదానీ డీల్ కోసం’ అని రాసుకొచ్చారు. అదానీ పవర్‌కు రూ.6000 కోట్ల హైడ్రో ప్రాజెక్ట్ డీల్‌పై సంతకం కోసం మోదీ భూటాన్ వెళ్లారని ఎక్స్‌లో ఫొటో ట్యాగ్ చేశారు.

News November 13, 2025

ఈ సమయంలో వరిని ఆశించే తెగుళ్లు – నివారణకు సూచనలు

image

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటలో మెడవిరుపు, గింజ మచ్చ తెగులు, సుడిదోమ, కంకినల్లి ఆశించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరిలో మెడవిరుపు లక్షణాలు కనిపిస్తే 200 లీటర్ల నీటిలో ఐసోప్రోథియోలేన్ 300ml లేదా కాసుగామైసిన్ 500ml కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. గింజమచ్చ, కంకినల్లిని గమనిస్తే స్పైరోమెసిఫెన్ 1ml+ ప్రొపికొనజోల్ 1ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

News November 13, 2025

IRCTCలో 46 ఉద్యోగాలు

image

<>IRCTC <<>>సౌత్ సెంట్రల్ జోన్‌ పరిధిలో 46 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. BSc (హాస్పిటాలిటీ), BBA/MBA, BSc(హోటల్ మేనేజ్‌మెంట్& క్యాటరింగ్ సైన్స్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ సికింద్రాబాద్‌లో ఈనెల 13, 14తేదీల్లో నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com