News October 5, 2025

మహిళల్లో గుండెపోటు.. కారణాలివే!

image

ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపోటు మరణాలు తక్కువ. అయితే ఇటీవల మహిళల్లోనూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయి. వీటికి అధిక బరువు, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, పొగ తాగడం, రుతుక్రమం ఆగడానికి మాత్రల వాడకం వంటివి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్లు పైబడిన మహిళలు కొన్ని కచ్చితమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Similar News

News October 5, 2025

పీరియడ్స్ రాకముందే PCOS వస్తుందా?

image

పీరియడ్స్ మొదలయ్యాక సాధారణంగా కనిపించే సమస్యల్లో PCOS ఒకటి. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. అయితే రుతుక్రమం మొదలుకాకముందే కొందరు బాలికల్లో PCOS లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. త్వరగా బరువు పెరగడం, పొట్టచుట్టూ కొవ్వు పెరగడం, చర్మ సమస్యలు, అవాంఛిత రోమాలు వస్తాయంటున్నారు. వీటిని గుర్తించిన వెంటనే వైద్యుల సూచనతో పోషకాలతో కూడిన ఆహారం, యోగా, వ్యాయామం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News October 5, 2025

వీళ్లు వేదాలు చదివినా వ్యర్థమే..

image

దైవభక్తి లేని వ్యక్తులు వేదాలు చదివినా వ్యర్థమే అని ‘భక్తి యోగం’ తెలుపుతోంది. దాని ప్రకారం.. ‘భక్తి లేకుండా ధర్మాలను ఆచరించడం, దానాలు చేయడం, కఠిన తపస్సులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాలుగు వేదాలు కంఠస్తం చేసినా వ్యర్థమే. ఈ కర్మలన్నీ ముఖ్య సాధనాలుగా భావించే భక్తి ఆ వ్యక్తిలో లేనప్పుడు ఆ కార్యాలన్నీ నిరుపయోగమైనవిగా మారతాయి. భగవంతునిపై భక్తియే సర్వశ్రేష్ఠమైనది, ముఖ్యమైనది’. <<-se>>#Daivam<<>>

News October 5, 2025

రజినీ సింప్లిసిటీ.. రోడ్డు పక్కన నిల్చొని భోజనం!

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హిమాలయాల సందర్శనకు వెళ్లారు. ‘జైలర్-2’ షూటింగ్‌కు వారం రోజులు తాత్కాలికంగా విరామం ఇచ్చి తీర్థయాత్రలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో సేద తీరుతున్నారు. అక్కడ రోడ్డు పక్కనే సాధారణ వ్యక్తిలా భోజనం చేస్తున్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. రజినీ ఇప్పటికే బద్రీనాథ్ ఆలయం, బాబా గుహ వంటి పలు పవిత్ర స్థలాలను సందర్శించినట్లు తెలుస్తోంది.