News August 14, 2024

HEART BREAK: మరోసారి నిరాశే

image

వినేశ్ ఫొగట్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్‌లో పతకానికి అడుగు దూరంలో ఉండగా ఆమెపై అనర్హత వేటు వేయడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనర్హతను సవాలు చేస్తూ ఆమె CASను ఆశ్రయించగా పతకంపై ఆశలు చిగురించాయి. ఈ క్రమంలో ఆమె తరఫున వాదనలను విన్న కోర్టు ముందుగా తీర్పును ఈ నెల 16కు వాయిదా వేసింది. అనూహ్యంగా కోర్టు ఇవాళ అప్పీల్‌ను <<13854289>>డిస్మిస్<<>> చేయడం హార్ట్ బ్రేకింగ్‌గా మారింది.

Similar News

News July 5, 2025

డీఎస్సీ నియామక ఉత్తర్వులపై ఆదేశాలు

image

AP: ఆగస్టు నాటికి డీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో ఆయన సమీక్షించారు. డిగ్రీ విద్యార్థులపై భారం తగ్గేలా UGC నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల ఎంపిక ఉండేలా చూడాలని సూచించారు. 2024-25కి సంబంధించి ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

News July 5, 2025

జులై 5: చరిత్రలో ఈరోజు

image

1906: నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1927: రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం
1980: సినీ నటుడు కళ్యాణ్‌రామ్ జననం(ఫొటోలో)
1995: బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జననం(ఫొటోలో)
2017: సంఘసేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం

News July 5, 2025

గ్రేట్.. 5వేల మందికి ఉచితంగా ప్రసవాలు

image

చదువుకోకపోయినా రూపాయి తీసుకోకుండా ఇప్పటివరకూ 5వేల ప్రసవాలు చేశారు రాజస్థాన్‌ అజ్మీర్‌కు చెందిన 80ఏళ్ల సువా దై మా. దాదాపు 50 ఏళ్లుగా 6 గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. తన అనుభవం, జ్ఞానంతో మహిళ నాడిని చెక్ చేసి గర్భధారణను ఆమె నిర్ధారిస్తుంటారు. తుఫానులొచ్చినా, అర్ధరాత్రైనా, కరెంట్ లేకున్నా ప్రసవాలు చేసేందుకు ముందుంటారు. ఆమె డబ్బును తీసుకోకుండా ఆశీర్వాదాలను మాత్రమే అంగీకరిస్తుంటారు.