News September 29, 2024
స్త్రీల కంటే పురుషుల్లోనే గుండె జబ్బులు అధికం

జీవసంబంధమైన, హార్మోనల్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల స్త్రీల కంటే పురుషులే అధికంగా గుండె జబ్బులబారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏటా 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నట్టు WHO తెలిపింది. మహిళల్లో ఈస్ట్రోజెన్ గుండె జబ్బు ప్రమాదాల తగ్గింపులో కీలకమని, జెనెటిక్స్, దురలవాట్ల వల్లే పురుషుల్లో ఈ సమస్య అధికమని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News October 14, 2025
డ్రిప్ సిస్టమ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

సాగులో నీటి వృథా కట్టడికి వాడే డ్రిప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో ట్రాక్టర్లు, బండ్లు, పశువుల రాకపోకల వలన లేటరల్ పైపులు అణిగిపోకుండా చూడాలి. ఎలుకలు డ్రిప్ సిస్టమ్లోని లేటరల్ పైపులను, ఇతర భాగాలను కొరికేయకుండా ఉండాలంటే సిస్టమ్ను తరచూ వాడాలి. దీని వల్ల భూమి తేమగా ఉండి ఎలుకలు ఆ పైపుల దగ్గరకురావు. కలుపు తీసేటప్పుడు పదునైన పరికరాలు డ్రిప్ లేటరల్ పైపులను కోసేయకుండా జాగ్రత్తపడాలి.
News October 14, 2025
తాజా రౌండప్

* తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని SC ఆదేశాలు
* ఈ నెల 18న BC సంఘాలు నిర్వహించే బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన TG జనసమితి చీఫ్ కోదండరాం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు
* TG ఇరిగేషన్ శాఖలో 106 మంది అధికారులు క్షేత్రస్థాయిలో బదిలీ
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 81, సెన్సెక్స్ 297 పాయింట్లు పతనం
News October 14, 2025
విజయనగరం జిల్లాలో మెగా జాబ్ మేళా

విజయనగరం జిల్లాలోని గరివిడి SDS డిగ్రీ కాలేజీలో రేపు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేసుకోనున్నాయి. 10 MNC కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి.