News April 5, 2025
హార్ట్ బ్రేక్.. హార్దిక్ పాండ్య ఎమోషనల్

LSGతో జరిగిన మ్యాచ్లో ఓడిన తర్వాత MI కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎమోషనల్ అయ్యారు. బౌలింగ్లో 5 వికెట్లు తీసినా, ఛేజింగ్లో చివరి వరకు పోరాడినా జట్టుకు విజయం దక్కలేదు. దీంతో ఆయన నిరాశకు లోనై బాధపడగా ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. తిలక్ వర్మ బెటర్గా ఆడి ఉంటే మ్యాచ్ గెలిచేదని పోస్టులు పెడుతున్నారు. గతంతో పోలిస్తే గెలవాలనే కసి MIలో ఎందుకనో కనిపించట్లేదని క్రీడావిశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీ COMMENT.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


