News August 28, 2024
మహిళలపై అఘాయిత్యాలు చూస్తోంటే హృదయం ముక్కలవుతోంది: మాళవిక

కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తనను ఎంతో బాధించిందని హీరోయిన్ మాళవిక మోహనన్ అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు చూస్తోంటే తన హృదయం ముక్కలవుతోందని చెప్పారు. ‘కోల్కతా ఘటన గురించి తెలియగానే షాక్కు గురయ్యా. మహిళలకు ఎప్పుడు, ఎక్కడ ఎటువైపు నుంచి ఆపద వస్తుందో తెలియడం లేదు. కొందరిపై దాడి జరిగినా బయటకు చెప్పడం లేదు. కొందరు మాత్రమే బయటపెడుతున్నారు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
HYD: నాగోల్లో విషాదం.. దంపతుల సూసైడ్

నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుల బాధతో మల్లేశ్, సంతోష పురుగుల మందు తాగారు. అక్కడికక్కడే భార్య మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. శుక్రవారం ఉదయం చైతన్యపురి పీఎస్లో వారి కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
News November 21, 2025
టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్లో ఉపయోగాలు ఇవే..

* వారానికి 48 గంటల పని, ఓవర్ టైమ్ వర్క్ చేస్తే రెట్టింపు వేతనం
* కార్మికులకు తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్లు
* ఫిక్స్ట్-టర్మ్ ఎంప్లాయిమెంట్ ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రత, పర్మనెంట్ ఉద్యోగుల మాదిరి చట్టపరణమైన రక్షణ
* అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సామాజిక న్యాయం
* భూగర్భ మైనింగ్, భారీ యంత్రాల వంటి పనులకూ మహిళలకు అనుమతి


