News January 13, 2025
బాల మావయ్యకు హృదయపూర్వక అభినందనలు: లోకేశ్

‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో మంత్రి లోకేశ్ తన మామ, హీరో బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన ఎనర్జీ, చరిష్మా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోందన్నారు. ఈ సినిమాకు విశేష స్పందన వస్తోందని, ప్రతిచోటా రికార్డులను బ్రేక్ చేస్తోందని పేర్కొన్నారు. బాలయ్య తెలుగు సినిమాకు కొత్త బెంచ్ మార్కులు సెట్ చేయడం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
Similar News
News December 29, 2025
రాయచోటి ప్రజలకు క్షమాపణలు: మంత్రి రాంప్రసాద్

AP: రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడంతో <<18702293>>కన్నీళ్లు<<>> పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై తొలిసారి స్పందించారు. స్థానిక ప్రజలకు క్షమాపణ చెప్పారు. రాయచోటి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టబోనని స్పష్టం చేశారు. ప్రజలు ఏడాదిలో ఈ బాధ నుంచి బయటపడేలా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడనని, విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇస్తానన్నారు.
News December 29, 2025
డాక్యుమెంట్, ట్రైన్ చేసిన దండకారణ్య డాక్టర్

లొంగిపోయిన మావోయిస్టు చందు దండకారణ్య మిస్టరీ డాక్టర్ రఫీఖ్/మణిదీప్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. పంజాబ్కు చెందిన ఈ డాక్టర్ కనీస సౌకర్యాలతోనే అడవిలో సర్జరీలూ చేశారు. మావోలు, ఆదివాసీలకు చేసే ప్రతి ట్రీట్మెంట్ డాక్యుమెంట్ చేసి దళానికి కాపీ ఇచ్చి, ప్రతి టీంలో అల్లోపతి, ఆయుర్వేదంలో రెగ్యులర్ ట్రీట్మెంట్ నేర్పారు. 2016లో దండకారణ్యం నుంచి ఝార్ఖండ్కు వెళ్లిన అతడి ఆచూకీ ఇంకా బయటకు తెలియదు.
News December 29, 2025
దేశవాళీ పండ్లు, కూరగాయల్లోనే అధిక పోషకాలు

గ్రామీణ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పెరిగే దేశవాళీ పండ్లు(ఉసిరి, నేరేడు, పనస, ఈత, తాటి, మామిడి, వెలగ) కూరగాయలు(గుమ్మడి, దొండ, చిక్కుడు, మునగ, కర్రపెండలం, చిలగడదుంప, కంద, చామ మొదలైనవి), ఆకుకూరలు అధిక పోషకాలు, ఔషధ విలువలను కలిగి ఉంటాయి. హైబ్రీడ్ రకాలకంటే దేశవాళీ రకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల అధికంగా పీచు పదార్థం, ఖనిజ లవణాలు, విటమినులు, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు అంది ఆరోగ్యం బాగుంటుంది.


