News February 1, 2025
రాష్ట్రంలో ఉక్కపోత షురూ
AP: రాష్ట్రంలో రెండు రోజులుగా ఉక్కపోత మొదలైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు 2024 మాదిరే 2025 కూడా అత్యంత వేడి సంవత్సరంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Similar News
News February 1, 2025
అసలు బడ్జెట్‌కు, GSTకి లింకేంటి?
Tax అనగానే SMలో Income Tax, GSTకి ముడిపెట్టి ఏదేదో మాట్లాడుతుంటారు. రూ.50లక్షల కారు కొంటే 28% GST, 20% GST Cess, మళ్లీ 30% IT అంటూ పోస్టులు పెడతారు. అన్నీ బడ్జెట్లోనే నిర్ణయించేస్తారని భావిస్తుంటారు. బడ్జెట్లో IT శ్లాబులు, పాలసీల గురించే ఉంటుంది. GSTతో లింకు ఉండదు. ఈ పన్ను రేట్లను ఆ కౌన్సిల్ ఏటా 3 సార్లు సమావేశమై నిర్ణయిస్తుంది. అంతా ఏకగ్రీవమే. ఒక్క రాష్ట్రం వ్యతిరేకించినా నిర్ణయం తీసుకోరు.
News February 1, 2025
స్వల్పంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 తగ్గించాయి. ఈ నిర్ణయంతో ఢిల్లీలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1797కి చేరింది. ఈ రేటు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పూ లేదు.
News February 1, 2025
రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగం
TG: రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ ‘ఎకనమిక్ సర్వే’ తెలిపింది. 2023లో 8.8 శాతం నిరుద్యోగం ఉండగా, 2024లో అది 6.6 శాతానికి తగ్గిందని వెల్లడించింది. దేశంలోనే జమ్మూ కశ్మీర్(11.8 శాతం)లో అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత ఒడిశా (10.6), ఛత్తీస్‌గఢ్ (10.4), కేరళ (10.1), ఉత్తరాఖండ్ (7.8), హిమాచల్ ప్రదేశ్ (8.7), అస్సాం (7.9 శాతం)లో ఉన్నట్లు వివరించింది.