News March 31, 2025
నేడు 38 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం-8, విజయనగరం-9, మన్యం-10, అల్లూరి-2, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఉష్ణోగ్రతలు మండిపోయాయి. ప్రకాశం జిల్లా అమాని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News April 2, 2025
కాలేజీల అనుమతికి హైపవర్ కమిటీ

AP: మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీల అనుమతికి ఇచ్చే ఈసీ జారీకి హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, స్విమ్స్ డైరెక్టర్, వైద్యవిద్య డైరెక్టర్‌తో ఈ కమిటీ ఉండనుంది. ప్రైవేట్ రంగంలో ఏర్పాటయ్యే కాలేజీలకు ఈసీ జారీ, తనిఖీ కోసం ఈ కమిటీ పనిచేయనుంది.
News April 2, 2025
మగవారితో పోలిస్తే అతివల్లో ఎక్కువ నిద్రలేమి

ఆరోగ్యానికి చక్కటి నిద్ర అత్యవసరం. కానీ పురుషులతో పోలిస్తే మహిళల్లో నిద్రలేమి ఎక్కువ ఉందని USకు చెందిన ‘రెస్‌మెడ్’ సంస్థ అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం.. వారంలో పురుషులు సగటున 4.13 రాత్రుళ్లు హాయిగా నిద్రపోతుంటే స్త్రీలు 3.83 రాత్రుళ్లు మాత్రమే సరైన నిద్రపోతున్నారు. హార్మోన్ల మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళనల వంటి కారణాలు స్త్రీల నిద్రని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
News April 2, 2025
HCU భూముల వివాదంపై సెలబ్రిటీల స్పందన

హెచ్‌సీయూ భూముల వివాదంపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇషా రెబ్బా, రేణూ దేశాయ్, ప్రియదర్శి, ఉపాసన కొణిదెల, కావ్య కళ్యాణ్‌రామ్, రష్మీ గౌతమ్, అభినవ్ గోమఠం, నోయెల్ షాన్, ప్రియాంక జవాల్కర్ తమ ఇన్‌స్టాల్లో హెచ్‌సీయూ భూముల్ని, అక్కడి ప్రాణుల్ని కాపాడాలనే అర్థంలో స్టోరీలు పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.