News March 13, 2025
అసెంబ్లీ వద్ద భారీగా మార్షల్స్ మోహరింపు

తెలంగాణ అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి <<15744584>>వ్యాఖ్యలు<<>> తీవ్ర దుమారం రేపాయి. దీంతో సభను స్పీకర్ వాయిదా వేయగా కొద్దిసేపటి క్రితమే తిరిగి పున:ప్రారంభం అయింది. జగదీశ్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అటు సభ వద్ద భారీగా మార్షల్స్‌ను మోహరించారు.
Similar News
News March 13, 2025
ఉద్యోగుల మధ్య జీతాల తేడాలొద్దు: నారాయణ మూర్తి

ఉద్యోగుల మధ్య జీతాల తేడా ఉండకూడదని, వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. తక్కువ, ఎక్కువ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ ఈవెంట్‌లో అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఉద్యోగి గౌరవం, హుందాతనాన్ని కాపాడాలి. వారిని ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, మందలించేటప్పుడు ఏకాంతంగా చెప్పాలి. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికీ సమానంగా అందించాలి’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
హోళీ రంగులు పోవాలంటే ఇలా చేయండి

– బయటకు వెళ్లే ముందు పెట్రోలియం జెల్లీ లేదా నూనె రాసుకుంటే లేయర్‌లా కాపాడుతుంది
– రంగులు పడ్డాక వీలైనంత త్వరగా నీటితో కడుక్కోండి
– చేతికి హానికర కెమికల్ కలర్స్ అంటితే సీ సాల్ట్, గ్లిజరిన్, ఆల్మండ్ ఆయిల్‌తో రుద్దండి
– రంగులు చల్లుకున్నాక నేరుగా షాంపూతో తలను శుభ్రం చేయకుండా ముందుగా నీళ్లతో కడగండి
– పెరుగు, నిమ్మరసం కలిపి రంగులు బాగా అంటిన చోట రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయండి
News March 13, 2025
IPLకు మార్క్‌వుడ్ దూరం!

IPL టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ టోర్నీకి దూరం కానున్నారు. మోకాలికి గాయం కావడంతో ఆయన సర్జరీ చేయించుకున్నారు. దీంతో 4 నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. IPL మెగా వేలంలో వుడ్‌ను రూ.7.50 కోట్లు వెచ్చించి లక్నో కొనుగోలు చేసింది. కానీ ఆయన ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదు. ఫ్రాంచైజీ ఆయన స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది.