News August 29, 2024

భారీ వరదలు.. మొబైల్ యూజర్లపై కీలక నిర్ణయం

image

గుజరాత్‌లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంట్రాసర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని మొబైల్ యూజర్లు తమ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్టెల్, JIO, VI, BSNLలో బెస్ట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటల వరకు ఇది అందుబాటులో ఉండనుంది.

Similar News

News December 27, 2025

Money Tip: ఈ లీకులను అరికడితేనే..

image

తెలియకుండానే మన డబ్బు అనవసర ఖర్చుల రూపంలో వృథా అవుతుంటుంది. వినియోగించని సబ్‌స్క్రిప్షన్లు, అరుదుగా వెళ్లే జిమ్ మెంబర్‌షిప్‌లు, బ్యాంకు ఛార్జీల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బయట భోజనం, ఖరీదైన కాఫీ అలవాట్లను తగ్గించి ఇంట్లోనే తింటే భారీగా ఆదా చేయొచ్చు. ఇలాంటి ఖర్చులను Invisible Leaks అంటారు. వీటిని అరికట్టి ఆదా చేసిన డబ్బును ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తే పెద్దమొత్తంలో సంపదను సృష్టించొచ్చు.

News December 27, 2025

అస్సాంలో SIR.. 10.56 లక్షల ఓట్లు డిలీట్

image

అస్సాంలో SIR తర్వాత డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌ను ఎలక్షన్ కమిషన్ ఇవాళ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,51,09,754 మంది ఓటర్లు ఉన్నారు. మరో 93,021 మంది డౌట్‌ఫుల్ ఓటర్లు ఉన్నట్టు డ్రాఫ్ట్‌లో చూపింది. మరణించిన వాళ్లు, వలసదారులు, డూప్లికేట్ కలిపి మొత్తంగా 10,56,291 మంది పేర్లను ఎలక్టోరల్ రోల్ నుంచి తొలగించింది. అస్సాంలో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

News December 27, 2025

టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు

image

NTR ట్రస్టు, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారని CM CBN ప్రశంసించారు. HYDలో జరిగిన NTR ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తన కంటే ముందున్నారని, తాను పేపర్ చూసి స్పీచ్ ఇస్తుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారని చమత్కరించారు. ఇక చిన్నప్పుడు తనను చాలామంది IAS చదవమన్నా తాను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాయని చెప్పారు.