News October 9, 2024
భారీ వరదలు.. రూ.5.50 కోట్లు విరాళమిచ్చిన L&T

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల నుంచి విరాళాలు కొనసాగుతున్నాయి. ఈరోజు L&T కంపెనీ ఛైర్మన్ సుబ్రమణ్యం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని కలిసి రూ.5.50 కోట్ల చెక్‌ను విరాళంగా అందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం& వరంగల్ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2026
BJPకి రాజీనామా.. మళ్లీ BRSలోకి మాజీ MLA

TG: వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ BJP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎల్లుండి తిరిగి BRSలో చేరనున్నట్లు ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమై బీజేపీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వర్ధన్నపేట నుంచి రమేశ్ 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో BRS తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2024 మార్చిలో BJPలో చేరారు. తాజాగా BRS ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
News January 26, 2026
నలుగురు మంత్రుల అత్యవసర భేటీ?

TG: ఓవైపు సీఎం రేవంత్ అమెరికాలో ఉండటం, మరోవైపు సింగరేణిపై రచ్చ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్‌లో నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. లోక్‌భవన్‌లో ఎట్ హోం ముగిశాక భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్, అడ్లూరి ఒకే కారులో ప్రజాభవన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
News January 26, 2026
రేపు అఖిలపక్ష భేటీ

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని కేంద్రం కోరనుంది. అలాగే ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు ఇవ్వనుంది. కాగా ఈ నెల 28 నుంచి FEB 13 వరకు, MAR 9 నుంచి APR 2 వరకు రెండు విడతల్లో సమావేశాలు జరగనున్నాయి.


