News June 17, 2024
భారీ వర్షం.. అవసరమైతే కాల్ చేయండి!

హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈక్రమంలో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద నీటిని తొలగించేందుకు DRF సిబ్బంది కృషి చేస్తున్నట్లు GHMC తెలిపింది. ఎలాంటి సమస్యలున్నా 040-21111111, 9000113667 ఫోన్ చేయాలని తెలిపింది. ద్విచక్ర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. వర్షం తగ్గే వరకూ బయటకెళ్లకపోవడమే మంచిది.
Similar News
News November 15, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 15, 2025
రామాయణంలోని ముఖ్య ఘట్టంతో ‘వారణాసి’: రాజమౌళి

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించింది’ అని అన్నారు. మహేశ్కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్బంప్స్ వచ్చాయని తెలిపారు.
News November 15, 2025
1.20L గ్లైడ్ బాంబుల తయారీకి రష్యా ప్లాన్?

తమ దేశంపై దాడి కోసం రష్యా 1,20,000 గ్లైడ్ బాంబుల తయారీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఉక్రెయిన్ సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఆరోపించారు. వీటిలో 200KMకు పైగా లక్ష్యాలను చేరుకునే 500 లాంగ్ రేంజ్ వెర్షన్ బాంబులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వీటి వల్ల ఉక్రెయిన్కు భారీ నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ ఆరోపణలపై మాస్కో స్పందించలేదు. కాగా 2022 నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.


