News August 8, 2025

హైదరాబాద్‌కు భారీ వర్షసూచన

image

TG: రానున్న రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News August 8, 2025

పెళ్లి పీటలెక్కనున్న స్టార్ సింగర్

image

టాలీవుడ్ యంగ్ సింగర్, నేషనల్ అవార్డు విన్నర్ రోహిత్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రియురాలు డాక్టర్ శ్రేయతో తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకోగా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఈ వేడుకలో కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులే పాల్గొన్నారు. ఇటీవలే నేషనల్ అవార్డు వచ్చిన ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ అనే పాటను రోహితే పాడటం విశేషం.

News August 8, 2025

చంద్రబాబు ఆటలో సునీత కీలుబొమ్మ: మేరుగు

image

AP: సీఎం చంద్రబాబు ఆటలో వైఎస్ సునీత ఓ కీలుబొమ్మ అని వైసీపీ నేత మేరుగు నాగార్జున ఆరోపించారు. తన తండ్రిని ఓడించినవారికి ఆమె ఎలా మద్దతిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సునీత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవినాశ్ రెడ్డిని బలిపశువును చేస్తున్నారు. వివేకా హత్య కేసును వాడుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎవరి ప్రోద్భలంతో సునీత ఇదంతా చేస్తున్నారు?’ అంటూ ఆయన ప్రశ్నించారు.

News August 8, 2025

ఓ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా

image

మిల్కి బ్యూటీ తమన్నా కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓ స్టార్ హీరో తనను అవమానించారని, అరుస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆమె చెప్పారు. అసౌకర్యంగా ఫీలయ్యే సన్నివేశంలో నటించనని చెప్పినందుకు తనపై కోప్పడినట్లు తెలిపారు. ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పారని పేర్కొన్నారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం తమన్నా వెల్లడించలేదు.