News September 20, 2025

పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

image

AP: పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది.

Similar News

News September 21, 2025

H1B వీసా సమస్యను వెంటనే పరిష్కరించాలి: CM రేవంత్

image

TG: H1B వీసాపై ట్రంప్ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఇండో-అమెరికన్ సత్సంబంధాల్లో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదన్నారు. దీని వల్ల తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు.

News September 20, 2025

కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

image

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.

News September 20, 2025

రేపటి నుంచే సెలవులు.. హైవేపై రద్దీ

image

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 22 నుంచి దసరా సెలవులు మొదలవనుండగా ఆదివారం కలిసి రావడంతో రేపటి నుంచే హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. దీంతో HYD-విజయవాడ హైవే వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. HYD నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి HYDకు రాకపోకలు సాగించేవారితో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఇక ఏపీలో వచ్చేనెల 3న, టీజీలో 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అప్పటివరకు విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు.