News August 16, 2025
భారీ వర్షసూచన.. మరింత అప్రమత్తంగా ఉండాలి: CM రేవంత్

TG: రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను CM రేవంత్ ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు SDRF, NDRF సిబ్బంది ముందుగానే వెళ్తే వారితో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News August 17, 2025
సరోగసి కేసు: మరిన్ని ఆసుపత్రులకు నోటీసులు

TG: <<17423890>>సరోగసి<<>> కేసులో నిందితురాలు లక్ష్మి పలు ఆసుపత్రులకు ఏజెంట్‌గా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో హెగ్డే, లక్స్ ఆసుపత్రి, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్, ఫర్టీ కేర్, అమూల్య ఫెర్టిలిటీ, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రత నేరం అంగీకరించిన సంగతి తెలిసిందే.
News August 17, 2025
మనకు, చైనాకు తేడా ఇదే!

ఏదైనా వస్తువును విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇండియాలో సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయని పలువురు వ్యాపారవేత్తలు చెబుతున్నారు. చైనాలో ఒక కంటైనర్ ఫ్యాక్టరీ నుంచి పోర్టుకు వెళ్లాలంటే ఇన్వాయిస్, ప్యాకేజీ లిస్ట్ ఉంటే చాలంటున్నారు. అదే మన దేశంలో ట్యాక్స్ ఇన్వాయిస్, కమర్షియల్ ఇన్వాయిస్, ఈ-వే బిల్లు, ఇన్సూరెన్స్ పేపర్లు.. ఇలా 17-18 డాక్యుమెంట్లు అవసరం అని చెబుతున్నారు. దీనివల్ల ఎంతో టైమ్ వృథా అవుతోందంటున్నారు.
News August 17, 2025
ఫ్రీ బస్ స్కీమ్.. ఆధార్ జిరాక్స్, సాఫ్ట్ కాపీలకు అనుమతి?

AP: ‘స్త్రీ శక్తి’ స్కీమ్ అమలులో భాగంగా RTC బస్సుల్లో ఆధార్ జిరాక్స్, సెల్‌ఫోన్‌లో సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పథకం అమలు తీరుపై CM చంద్రబాబు సమీక్షించారు. ఘాట్ రోడ్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. గడచిన 30 గంటల్లో 12 లక్షల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఎల్లుండి నుంచి రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.