News July 11, 2024
హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కాప్రాలో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, అమీర్‌పేట్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. దీంతో ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరి మీ ప్రాంతంలోనూ వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
Similar News
News December 31, 2025
IIM బుద్ధ గయ 76 పోస్టులకు నోటిఫికేషన్

IIM బుద్ధ గయ 76 ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి PhD, పీజీ అర్హతతో పాటు బోధన, పరిశోధనలో అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,59,100, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,39,600, Asst. prof గ్రేడ్-1కు రూ.1,31,400, Asst. prof గ్రేడ్-2కు రూ. 89,900 చెల్లిస్తారు. వెబ్సైట్: iimbg.ac.in
News December 31, 2025
2025లో కన్నుమూసిన యాక్టర్లు

ఈ ఏడాది పలువురు సినీ తారలు నింగికెగిశారు. కోటా శ్రీనివాసరావు (జులై 13), ఫిష్ వెంకట్ (JUL 18), నటి చిత్తజల్లు కృష్ణవేణి (FEB 16), నటి&గాయని బాలసరస్వతీ దేవి(OCT 15), బాలీవుడ్ యాక్టర్లు మనోజ్ కుమార్ (APR 4), ధర్మేంద్ర (NOV 24), గోవర్ధన్ అస్రాని, ముకుల్ దేవ్, తమిళ నటులు రాజేశ్, రోబో శంకర్, మదన్ బాబ్, మలయాళ నటులు విష్ణుప్రసాద్, శ్రీనివాసన్, దక్షిణాది నటి సరోజా దేవి తదితరులు కన్నుమూశారు.
News December 31, 2025
ఖలీదా జియాకు సంతాపం.. మోదీ లేఖతో ఢాకా వెళ్లిన జైశంకర్

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం పట్ల సంతాపం తెలిపేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢాకా వెళ్లారు. ఆమె కుమారుడు, BNP తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్‌ను కలిసి ప్రధాని మోదీ పంపిన లేఖను అందించారు. భారత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖలీదా ఆశయాలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆకాంక్షించారు. 2026లో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.


