News August 11, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం

image

మహానగరంలో మరోసారి భారీ వర్షం మొదలైంది. ట్యాంక్‌బండ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, రాజేంద్రనగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. రాత్రి 9 గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా ప్రజలు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అటు వర్షం నేపథ్యంలో GHMC మాన్సూన్ బృందాలు అలర్ట్ అయ్యాయి.

Similar News

News February 11, 2026

మనస్సును ప్రశాంతంగా మార్చే భైరవీ ముద్ర

image

సుఖాసనంలో కానీ పద్మాసనం/వజ్రాసనంలో కూర్చోవాలి. నడుం వంగకుండా నిటారుగా ఉండేలా చూడాలి. రెండు చేతులను ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన , ఎడమ చేయి కింద ఉండేవిధంగా చూసుకోవాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుని వదులుతూ శ్వాసమీద ధ్యాసను ఉంచాలి. కనీసం 7నిమిషాల సమయం ఈ భైరవి ముద్రలో ఉంటే మనస్సు ప్రశాతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

News February 11, 2026

మొక్కజొన్నను ఆశించే తెగుళ్లు – నివారణ

image

మొక్కజొన్న నాటిన 30 రోజుల దశలో పేనుబంక ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ml, ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. నల్లులు ఆశించకుండా పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నల్లులు ఆశిస్తే లీటరు నీటిలో డైకోఫాల్ 50mlను కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు 1ml వేప నూనెను 5 గ్రాముల సబ్బుపొడిలో కలిపి పిచికారీ చేయాలి.

News February 11, 2026

నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

image

AP: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉ.10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 11.30 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 14న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 FYకి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ సమావేశాల నుంచి తొలిసారిగా డిజిటల్ అటెండెన్స్ విధానం ప్రవేశపెట్టనున్నారు.