News July 7, 2024
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం: వాతావరణ కేంద్రం

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల బాపట్ల, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, మన్యం, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
Similar News
News March 5, 2026
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 48 పోస్టులు

<
News March 5, 2026
మహిళలకు ఉచితంగా హెల్త్ చెకప్‌లు

TG: రాష్ట్రంలోని 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఫ్రీగా హెల్త్ చెకప్‌లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికి 30 రకాల పరీక్షలు చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేస్తారు. అన్ని రకాల రిపోర్టులతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు.
News March 5, 2026
మాయిస్ట్ హీట్‌తో ఈ సమ్మర్ వెరీ హాట్!

గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ ఎక్కువగా ఉంటే ‘మాయిస్ట్ హీట్’ అంటారు. ఈ సమ్మర్‌లో ఇది ఎక్కువ రోజులు ఉండనుంది. ‘సాధారణంగా ఎండలకు పట్టిన చెమట గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. మాయిస్ట్ హీట్‌తో గాలిలో తేమ ఉండటం వల్ల చెమట ఆవిరి కాదు. అయినా శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. దీంతో దాహం వేయకపోయినా నీరు తాగాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు. గాలిలో తేమ 60%, టెంపరేచర్ 30°C ఉంటే అది మనకు 40°C మాదిరి అనిపిస్తుంది.


