News August 19, 2024

కాసేపట్లో భారీ వర్షం

image

తెలంగాణలోని పలు చోట్ల ఇప్పటికే వర్షం కురవగా రానున్న 3 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, జనగామ, ఖమ్మం, ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వాన పడొచ్చని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.

Similar News

News January 13, 2026

షాక్స్‌గామ్ వ్యాలీ.. భారత్‌కు ఎందుకంత కీలకం?

image

<<18842137>>షాక్స్‌గామ్ వ్యాలీ<<>> భారత్‌కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్‌లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.

News January 13, 2026

షాక్స్‌గామ్ లోయను చైనాకు పాక్ ఎందుకిచ్చింది?

image

1963లో INDను వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పాక్ షాక్స్‌గామ్ లోయను చైనాకు అప్పగించింది. USపై నమ్మకం తగ్గడం, 1962 యుద్ధానంతరం చైనాతో స్నేహం ద్వారా రాజకీయ పట్టు సాధించాలని భావించింది. చిన్నపాటి సరిహద్దు వివాదాలనూ ముగించాలనుకుంది. ఈ ఒప్పందంతో POKపై పాక్ నియంత్రణను చైనా గుర్తించింది. బదులుగా కారకోరం పాస్‌పై చైనాకు ఆధిపత్యం దక్కి భారత్‌లోని సియాచిన్, లద్దాక్‌ ప్రాంతాలకు భద్రతా ముప్పు ఏర్పడింది.

News January 13, 2026

రాహుల్ విపక్ష నేత కాదు పర్యాటక నేత: షెహజాద్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ‘ఆయన ఎప్పుడూ సెలవుల మూడ్ లోనే ఉంటారు. కీలకమైన జాతీయ సమస్యల సమయంలోనూ విదేశాల్లోనే గడుపుతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పర్యాటక నాయకుడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు. రాహుల్ అపరిపక్వ నాయకుడని విమర్శించారు. కాగా వియత్నాం పర్యటనకు సంబంధించి రాహుల్ గాంధీ, INC ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.