News July 6, 2024

ఇవాళ, రేపు భారీ వర్షాలు

image

TG: ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది. మరోవైపు ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Similar News

News March 12, 2026

కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం!

image

AP: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2026-27లో 352 స్కూళ్లలో 6, 11 తరగతుల్లో అడ్మిషన్లకు, 7, 8, 9, 10, 12 తరగతుల్లో ఖాళీ సీట్ల కోసం <>ఆన్‌లైన్‌<<>>లో అప్లై చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు గడువు ఉంది. ఎంపికైన బాలికల జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. ఏప్రిల్ 17 వరకు ధ్రువపత్రాలను పరిశీలించి సీటును కన్ఫామ్ చేస్తారు.

News March 12, 2026

దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

image

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.

News March 12, 2026

డొమెస్టిక్ సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్

image

TG: రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. హోటల్ పరిశ్రమకు LPG అవసరాలు తీర్చడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సిలిండర్లు బ్లాక్ చేస్తే ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.