News September 6, 2024

భారీ వర్షాలు.. ఏపీలో 44 రైళ్లు రద్దు

image

భారీ వర్షాలు, వరదల కారణంగా ఈనెల 6, 7, 8, 9 తేదీల్లో విజయవాడ మీదుగా నడిచే 44 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను విజయవాడ డీఆర్ఎం Xలో <>పోస్ట్<<>> చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు నేడు విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు సర్వీసులనూ అధికారులు రద్దు చేశారు.

Similar News

News January 3, 2026

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈనెల 28 వరకు పోలీస్‌ యాక్ట్‌ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలంటే ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News January 3, 2026

అకౌంట్‌లో పడిన ₹40Crతో ట్రేడింగ్.. హైకోర్టు ఏమందంటే?

image

ముంబైకి చెందిన గజానన్ అనే ట్రేడర్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కోటక్ సెక్యూరిటీస్ పొరపాటున ₹40Cr మార్జిన్‌ను అతడి అకౌంట్‌లో వేసింది. వాటితో ట్రేడింగ్ చేసి అతను 20 ని.ల్లో ₹1.75Cr లాభం పొందాడు. ఆ లాభాన్నీ తిరిగి పొందాలని బ్రోకరేజ్ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ట్రేడర్ నైపుణ్యం వల్ల ఆ లాభం వచ్చిందని, తదుపరి విచారణ (FEB 4) వరకూ అతని వద్దే ఉంచుకోవచ్చని మధ్యంతర తీర్పునిచ్చింది.

News January 3, 2026

గంజాయి తీసుకుంటూ దొరికిన BJP MLA కుమారుడు

image

TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో BJP ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్‌రామ్‌గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించింది.