News September 9, 2024
భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు

AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వాహనాలు, వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్స్‌ను ఉపయోగించాలని ఆదేశించారు. వరద ప్రవాహాలు, గట్ల పటిష్ఠతను వాటి సాయంతోనే అంచనా వేయాలని సూచించారు. విజయవాడలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వైద్య శిబిరాలు కొనసాగించాలన్నారు. ముందస్తు చర్యలతోనే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు.
Similar News
News October 13, 2025
కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై అనిల్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు పెట్టారని, లాటరీలో షాపు దక్కకపోతే ఆ డబ్బు ఎక్సైజ్ శాఖకే వెళ్తుందన్నారు. షాప్ రానివారికి రూ.3 లక్షలు తిరిగిచ్చేలా ఆ శాఖను ఆదేశించాలని, ఆ GOను కొట్టేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఎక్సైజ్ శాఖకు నోటీసులు జారీ చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
News October 13, 2025
WOW: ఇది ఎక్కడో కాదు.. మన దగ్గరే

ఫొటో చూడగానే ఏ అమెరికానో, యూరప్ కంట్రీనో అని అనుకున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఇది మన హైదరాబాద్ నగరంలో తీసిన ఫొటోనే. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో తీసిన ఈ పిక్‌ను Xలో ఓ యూజర్ పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. ఎత్తైన భవనాలు, మధ్యలో బంగారు వర్ణం మబ్బులతో కనువిందు చేస్తోంది. మీకెలా అనిపించింది? COMMENT
credits: @beforeishutup
News October 13, 2025
నకిలీ మద్యంపై CBIతో విచారణ చేయించాలి: YCP

AP: CBNకు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని YCP డిమాండ్ చేసింది. నేడు రాష్ట్రంలో ధర్నాలు చేపట్టి అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు ఆ పార్టీ పేర్కొంది. తప్పు చేసిన వాళ్లే సిట్‌తో దర్యాప్తు చేయించడం హాస్యాస్పదమని విమర్శించింది. దోషులు ఎవరున్నా తక్షణమే అరెస్టు చేయాలని, కల్తీ సరకుతో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలంది. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసింది.