News December 21, 2024

భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై CMO అధికారులతో CM చంద్రబాబు సమీక్ష చేశారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులను అధికారులు వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకూ సెలవులు ఇచ్చినట్లు CMకు చెప్పారు. వర్షంతో దెబ్బతిన్న పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందించాలని CBN ఆదేశించారు. పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు.

Similar News

News October 20, 2025

టీడీపీ నేత సుబ్బనాయుడు కన్నుమూత

image

AP ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, TDP ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బనాయుడు కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నెల్లూరు(D) దగదర్తిలో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుబ్బనాయుడు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు.

News October 20, 2025

CDACలో 646 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC)కు చెందిన వివిధ కేంద్రాల్లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cdac.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 20, 2025

VITMలో 12పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM)లో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://www.vismuseum.gov.in/