News August 31, 2024
భారీ వర్షాలు.. పింఛన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు

AP: భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే 2,3 రోజుల్లో వారు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. దీన్నిబట్టి ఇవాళ పింఛన్ అందనివారికి రేపు, ఎల్లుండి పంపిణీ చేసే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని సీఎం వెల్లడించారు.
Similar News
News January 29, 2026
వరంగల్: టార్గెట్ కడియం శ్రీహరి..!

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్లో చేరిక పట్ల ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ఆయన చేరిక కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ జరిగినట్లు కనిపిస్తోంది. ఎర్రబెల్లి, అరూరి మాటలు సైతం శ్రీహరి పేరును ఉచ్చరిస్తూ కనిపించాయి. స్టేషన్ఘన్పూర్ బై ఎలక్షన్ వచ్చే సూచనలతో అరూరిని అక్కడి నుంచి పోటీ చేసేందుకే మళ్లీ పార్టీలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు మాట్లాడుతున్నాయి. మీ కామెంట్..!
News January 29, 2026
మొక్కజొన్న పంటలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

మొక్కజొన్న పైరు ఒకవేళ 60 నుంచి 65 రోజుల దశలో ఉంటే పంటకు అవసరం మేర ఎరువులను అందించాలి. ఈ సమయంలో చివరి దఫా నత్రజని ఎరువుగా ఎకరాకు 50 కిలోల యూరియా మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. పూత దశకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో పైరుకు నీటి తడులను తప్పనిసరిగా అందించాలి. నేల స్వభావం బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీటిని అందించకుంటే పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.
News January 29, 2026
కరుంగలి మాల ఎందుకు ధరించాలంటే…?

కరుంగలి మాల ఆభరణమే కాదు! శక్తిమంతమైన రక్షణ కవచం కూడా. ఇది ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని దరిచేరనీయదు. కుజ దోషం ఉన్నవారు దీనిని ధరిస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, సోమరితనాన్ని తగ్గించి మనశ్శాంతి ప్రసాదిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు, ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నవారు ఈ పవిత్రమైన మాలను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని సిద్ధ సంప్రదాయం చెబుతోంది.


