News August 14, 2025

భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

image

APలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఏమైనా సమస్య వస్తే గుంటూరు-0863-2234014, పల్నాడు- 08647-252999, NTR-8181960909, 0866-2427485, అల్లూరి-08864-243561, అనపర్తి-9441386920, బిక్కవోలు-9849903913, గోకవరం-9491380560, కొవ్వూరు-9866778416, రాజమండ్రి-0883-2416005, రాజానగరం-9494546001, సీతానగరం-9177096888, కాకినాడ-0884 2356801 నంబర్లకు ఫోన్ చేయండి.

Similar News

News August 16, 2025

ఉక్రెయిన్‌పై ప్రధానంగా చర్చించాం: పుతిన్

image

US అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధానంగా ఉక్రెయిన్ అంశంపై చర్చించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ‘ఈ భేటీలో చాలా అంశాలపై ఓ అభిప్రాయానికి వచ్చాం. అమెరికాతో నాలుగేళ్లపాటు ఎలాంటి సంబంధాలు లేకపోవడం అనేది నిజంగానే చింతించాల్సిన విషయం. నేను జెలెన్‌స్కీ, నాటోకి ఫోన్ చేసి మాట్లాడతాను. నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది. ఈ విషయంలో కచ్చితంగా ట్రంప్‌కు ధన్యవాదాలు చెప్పాలి’ అని వ్యాఖ్యానించారు.

News August 16, 2025

పుతిన్‌తో చర్చల తర్వాత జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్‌!

image

US అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సమావేశం ముగిసింది. ఈ భేటీలో చర్చలు పాజిటివ్‌గా సాగినట్లు రష్యా వర్గాలు తెలిపాయి. పుతిన్‌తో మాట్లాడాక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యూరోపియన్‌ లీడర్లకు ట్రంప్ ఫోన్ చేసినట్లు అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ భేటీ వివరాలను ఆయన వారికి తెలియజేసినట్లు సమాచారం. ఒకవేళ రష్యా ఏమైనా షరతులు పెట్టి ఉంటే.. వాటిని జెలెన్‌స్కీకి వివరించినట్లు తెలుస్తోంది.

News August 16, 2025

అలా చేస్తే ట్రంప్‌ని నోబెల్‌కి నామినేట్ చేస్తా: హిల్లరీ

image

ఒక షరతుపై US అధ్యక్షుడు ట్రంప్‌ని నోబెల్‌ బహుమతికి నామినేట్ చేస్తానని 2016లో ఆయనతో పోటీచేసి ఓడిన హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. ‘కీవ్ నుంచి ఉక్రెయిన్ కొంచెం కూడా భూభాగాన్ని కోల్పోకుండా, రష్యా-ఉక్రెయిన్ మధ్య ట్రంప్ యుద్ధాన్ని ఆపగలిగితే నేనే స్వయంగా ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తాను’ అని హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. మరి.. పుతిన్‌ని ట్రంప్ సీజ్‌ఫైర్‌కి ఒప్పిస్తారా? కామెంట్ చేయండి.