News December 2, 2024
భారీ వర్షాలు, వరదలు.. గర్భిణులకు అండగా వైద్యులు!

‘ఫెంగల్’ తుఫాను కారణంగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీటిలో చిక్కుకుని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలోనూ వైద్య సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టినట్లు అధికారులు తెలిపారు. బలమైన గాలులు, వర్షాల్లోనూ అక్కడి వైద్యులు నవంబర్ 30న రాష్ట్రంలో 1,526 మందికి సురక్షితంగా డెలివరీ చేసినట్లు వెల్లడించారు. గర్భిణులకు ఔషధాలు సైతం అందిస్తున్నామన్నారు.
Similar News
News January 27, 2026
వాట్సాప్ సురక్షితం కాదు: ఎలాన్ మస్క్

మెసేజింగ్ యాప్ వాట్సాప్లో ప్రైవసీ ఉల్లంఘన జరుగుతుందన్న కథనంపై బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. మెటా కంపెనీ వాట్సాప్ చాట్ ప్రైవసీ, సెక్యూరిటీపై తప్పుడు హామీలు ఇచ్చిందంటూ యూఎస్ కోర్టులో పిటిషన్ దాఖలవ్వగా వాట్సాప్ సురక్షితం కాదని మస్క్ ట్వీట్ చేశారు. సిగ్నల్(యాప్) కూడా ప్రశ్నార్థకమేనని, X చాట్ వాడాలని పేర్కొన్నారు. గతంలో ఆయన వాట్సాప్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తగా మెటా ఖండించింది.
News January 27, 2026
ఆడ తోడు కోసం పెద్ద పులి సుదీర్ఘ ప్రయాణం!

TG: యాదాద్రి జిల్లాలో రెండు వారాలుగా పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. రాజాపేట, తుర్కపల్లి, యాదాద్రి మండలాల్లో సంచరిస్తూ లేగదూడలపై దాడులు చేస్తోంది. అటవీశాఖ అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా పులి జాడ కనుక్కోలేకపోతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి నదులు, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలు దాటుకుంటూ 400km ప్రయాణించి, ఆడ పులి తోడు కోసం వచ్చినట్లు భావిస్తున్నారు.
News January 27, 2026
173 పోస్టులు.. దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

NCERTలో 173 నాన్ అకడమిక్ పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.ncert.nic.in * మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


