News August 24, 2025
మూడు రోజులు భారీ వర్షాలు!

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా-ప.బెంగాల్‌కు ఆనుకొని రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని తెలిపింది.
Similar News
News August 25, 2025
ఈ సమయాల్లో నీరు తాగితే?

శరీరానికి అత్యవసరమైన వాటిలో నీరు ఒకటి. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగితే ఎన్నో రోగాలను ముందుగానే నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
✒ నిద్ర లేవగానే గోరు వెచ్చని నీరు తాగితే టాక్సిన్స్(వ్యర్థాలు)ను బయటకు పంపుతుంది. ✒ భోజనానికి ముందు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ✒ స్నానానికి ముందు నీరు తాగితే బీపీ నియంత్రణలో ఉంటుంది. ✒ నిద్రకు ముందు తాగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది.
News August 25, 2025
దక్షిణాఫ్రికా పేరిటే ఆ రికార్డు

వన్డేల్లో అత్యధిక సార్లు 400+ రన్స్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా(8) పేరిట రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో టీమ్ ఇండియా(7), ఇంగ్లండ్(6), <<17503678>>ఆస్ట్రేలియా<<>>(3), NZ(2), SL(2), జింబాబ్వే(1) ఉన్నాయి. చిత్రమేమిటంటే వెస్టిండీస్, PAK, బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా ఈ మార్క్ అందుకోలేకపోయాయి. మరోవైపు ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సిరీస్‌లు(సిరీస్‌లో కనీసం 3 వన్డేలు) గెలిచిన జట్టుగా సౌతాఫ్రికా(9) రికార్డు నెలకొల్పింది.
News August 25, 2025
కొత్త రేషన్ కార్డులు.. నేటి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ

AP: నేటి నుంచి దశల వారీగా <<17506953>>కొత్త రేషన్<<>> కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రేషన్ పంపిణీలో లబ్ధిదారులకు పారదర్శకతతో కూడిన మెరుగైన సేవలను అందించేందుకు క్యూఆర్‌తో కూడిన స్మార్ట్ కార్డులను ఇవ్వనుంది. తొలి విడతలో ఇవాళ్టి నుంచి 9 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. రెండో విడతలో ఈ నెల 30 నుంచి మరో నాలుగు జిల్లాల్లో, మూడో విడతలో సెప్టెంబర్ 6 నుంచి ఐదు జిల్లాల్లో, 15 నుంచి 8 జిల్లాల్లో ఇవ్వనున్నారు.