News August 31, 2024
భారీ వర్షాలు.. నలుగురు దుర్మరణం

AP: భారీ వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన <<13982784>>ఘటనలో<<>> మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద మరికొంత మంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Similar News
News October 30, 2025
జనగామ: రైతులకు అండగా ఉండండి: కలెక్టర్

వర్షాల నేపథ్యంలో రైతులకు అండగా ఉండాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మీరేమంటారు?

TG: అజహరుద్దీన్ మంత్రి కావడానికి టైం ఫిక్స్ అయింది. కాగా మంత్రివర్గ విస్తరణ సమయాల్లో గతంలో లేనంతగా కాంగ్రెస్ తాజా నిర్ణయం కాక రేపుతోంది. దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారని BJP.. ఓ సామాజికవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారిందని BRS ధ్వజమెత్తాయి. అయితే అజహరుద్దీన్ క్రికెట్లో దేశానికి పేరు తెచ్చారని, ఆయనకు పదవి రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై మీరేమంటారు.
News October 30, 2025
CBSE పరీక్షల తేదీలు విడుదల

వచ్చే ఏడాది జరిగే టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫైనల్ డేట్ షీట్‌ను CBSE విడుదల చేసింది. రెండు క్లాసులకూ ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు మొదలవుతాయి. టెన్త్ విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు, 12వ క్లాస్ స్టూడెంట్లకు ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ <


