News August 29, 2024
రేపటి నుంచి భారీ వర్షాలు

TG: బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రేపటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగస్టు 30 నుంచి SEP 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, KRMR, KMM, మహబూబాబాద్, WGL, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News December 1, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-<
News December 1, 2025
రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

సినీ ఇండస్ట్రీలో విడాకులు, పలు కారణాలతో రెండో పెళ్లి చేసుకోవడం కామన్గా మారింది. రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా హీరోయిన్ <<18437680>>సమంత<<>> చేరారు. ఈ లిస్టులో సీనియర్ NTR, సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, నాగ చైతన్య, అమలాపాల్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నటుడు నరేశ్, నటి రాధిక మూడో పెళ్లి చేసుకున్న వారి లిస్టులో ఉన్నారు.
News December 1, 2025
నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.


