News December 10, 2024
రేపటి నుంచి భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా పడతాయంది. నేడు ASR, తూ.గో., ప.గో., కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, YSR జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు, TGలోని పలు జిల్లాలో ఇవాళ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
Similar News
News November 25, 2025
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

గువాహటిలోని <
News November 25, 2025
టీమ్ ఇండియాకు షాక్.. 2 వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 549 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 21 రన్స్కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ 13, కేఎల్ రాహుల్ 6 పరుగులకే ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. జాన్సెన్, హార్మర్ తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి మరో 527 రన్స్ కావాలి.
News November 25, 2025
BJP నన్ను రాజకీయంగా ఓడించలేదు: మమత

బీజేపీ రాజకీయంగా పోరాడి తనను ఓడించలేదని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఈసీ నిష్పాక్షిక సంస్థ కాదని, ‘BJP కమిషన్’గా మారిపోయిందని ఆరోపించారు. బొంగావ్లో యాంటీ SIR ర్యాలీలో ఆమె మాట్లాడారు. బిహార్లో NDA ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని చెప్పారు. ఇంత తొందరగా SIR నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఓట్ల జాబితా నిజమైనది కాకపోతే, 2024లో బీజేపీ గెలుపు కూడా నిజమైనది కాదని ఆరోపించారు.


