News July 19, 2024

భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: రాష్ట్రంలో కుండపోత వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. వరద ప్రభావం అధికంగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీసినట్లు మంత్రి చెప్పారు.

Similar News

News September 2, 2024

భారత జట్టుకు సూర్య దూరం?

image

బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడుతూ గాయపడ్డ భారత ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ రౌండ్‌కు దూరమవనున్నారు. SEP 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు జట్టును BCCI ఎంపిక చేయనుంది. సీనియర్లు కాక భారత జట్టులో చోటు ఆశిస్తున్న వారు ఈ ట్రోఫీ ఆడుతున్నారు. దీంతో SKY భారత జట్టుకు దూరమయ్యే ఛాన్సుంది. సెప్టెంబర్ 19 నుంచి BANతో టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది.

News September 2, 2024

ఏపీలో భారత క్రికెటర్ల సందడి

image

అనంతపురంలో భారత క్రికెటర్ల రాకతో సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 5 నుంచి దులీప్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, తుషార్ దేశ్ పాండే తదితర ప్లేయర్లు బస్సులో బెంగళూరు నుంచి అనంతపురం చేరుకున్నారు. తొలి మ్యాచ్ ఆర్టీడీ మైదానంలో 5న ఇండియా సీ, డీ జట్ల మధ్య జరగనుంది. ఆటగాళ్లకు అలెగ్జాండర్ త్రీస్టార్ హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు.

News September 2, 2024

సెబీ చీఫ్ మాధబీపై మరిన్ని ఆరోపణలు

image

సెబీ చీఫ్ మాధ‌బీని తాజాగా ‘జీ’ ఎమిరిటస్ ఛైర్మన్ సుభాష్ చంద్ర టార్గెట్ చేశారు. ‘జీ’ నిధుల మళ్లింపు కేసులో సెబీ విచార‌ణ నుంచి విముక్తి క‌ల్పించ‌డానికి ఒక బ్యాంకు ఛైర్మ‌న్ ద్వారా మంజిత్ సింగ్ అనే వ్య‌క్తి త‌న‌ను సంప్ర‌దించి ‘ప్రైస్ డీల్’ మాట్లాడిన‌ట్టు ఆరోపించారు. మాధబీ, ఆమె భర్త ఆదాయం ఏటా కోటి ఉండేదని, ఇటీవల రూ. 40-50 కోట్లకు పెరిగినప్పటి నుంచి ఆమె అవినీతిపరురాలని నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు.