News October 15, 2024
భారీ వర్షాలు.. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు

AP: రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి-0877-2236007, గూడూరు-8624252807, సూళ్లూరుపేట-8623295345, తిరుపతి RDO-7032157040, శ్రీకాళహస్తి-9966524952 నంబర్లను అందుబాటులో ఉంచారు. అటు పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News December 17, 2025
గర్భిణులకు ఫోలిక్ యాసిడ్తో ఎంతో మేలు

గర్భం దాల్చాలనుకునే మహిళలు/ గర్భం దాల్చిన మహిళలకు ఫోలిక్ యాసిడ్ తప్పనిసరని వైద్యులు చెబుతుంటారు. ఫోలిక్ యాసిడ్ని విటమిన్ B9 అని కూడా అంటారు. దీన్ని రోజూ తీసుకుంటే బిడ్డ న్యూరల్ ట్యూబ్, మెదడు, వెన్నుపాము అభివృద్ధికి సాయపడుతుంది. పిల్లలు నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టడం, గర్భస్రావం, ప్రీఎక్లాంప్సియా, హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్లు, అల్జీమర్స్ రాకుండా ఫోలిక్ యాసిడ్ సాయపడుతుంది.
News December 17, 2025
ఏపీలో 6 జోన్లు.. ఏ జిల్లా ఎక్కడంటే?

రాష్ట్రంలో 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా <<18586844>>కేంద్రం<<>> విభజించింది.
*జోన్-1: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, VZG, అనకాపల్లి.
*జోన్-2: అల్లూరి, తూ.గో., కాకినాడ, కోనసీమ.
*జోన్-3: ప.గో., ఏలూరు, కృష్ణా, NTR.
*జోన్-4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు.
*జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప.
*జోన్-6 : కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి.
*మల్టీజోన్-1: జోన్-1, 2, 3
*మల్టీజోన్-2: జోన్-4, 5, 6
News December 17, 2025
చిన్నతనంలో ఊబకాయం రాకూడదంటే..!

చిన్నారుల్లో ఊబకాయం రాకూడదంటే శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలున్న ఆహారం ఇవ్వాలి. పిల్లలు ఔట్ డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా పిల్లలు బరువు పెరగవచ్చు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 8-9 గంటలు నిద్రపోయేలా టైమ్ టేబుల్ సెట్ చేయండి. పిల్లల్లో ఊబకాయాన్ని నివారించడానికి, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.


