News October 23, 2025
భారీ వర్షాలు.. ఇవాళ స్కూళ్లకు సెలవు

AP: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ 5 జిల్లాల్లో ఇవాళ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు ప్రకాశంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Similar News
News October 23, 2025
‘హలాల్’ లాభాలతో లవ్ జిహాద్, టెర్రరిజం: యోగి

‘హలాల్’పై UP సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హలాల్ చేసిన వస్తువుల విక్రయంతో వచ్చిన లాభాలతో లవ్ జిహాద్, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. సర్టిఫికేషన్ పేరుతో ₹25వేల కోట్లు దుర్వినియోగం చేశారు. అందుకే హలాల్ వస్తువులను నిషేధించాం’ అని అన్నారు. ఇస్లామిక్ చట్టానికి లోబడి తయారు చేసేవాటికి హలాల్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ ఆరోపణలతో సమస్యలను CM తప్పుదోవపట్టిస్తున్నారని ప్రతిపక్షాలంటున్నాయి.
News October 23, 2025
తేనెతో జుట్టుకు పోషణ

తేనె వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే తేనె సౌందర్య పరిరక్షణలో, జుట్టు సంరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. * తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుందని చెబుతున్నారు. *తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుందని తెలిపారు.
News October 23, 2025
డార్లింగ్ సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ‘ఈశ్వర్’ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం దిగ్విజయంగా. ఆయన ఇప్పటివరకూ వర్షం, ఛత్రపతి, పౌర్ణమి, బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలి 1&2, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీతో సహా మొత్తం 23 సినిమాల్లో నటించారు. వీటిలో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.