News August 31, 2024

భారీ వర్షాలు.. 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈమేరకు జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేేశారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా రాష్ట్రంలో నేడు అతిభారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

Similar News

News October 16, 2025

గ్రీన్ క్రాకర్స్ సురక్షితమేనా?

image

పొల్యూషన్ తగ్గించేందుకు వాడే <<18010671>>గ్రీన్ క్రాకర్స్‌<<>> కూడా పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే పొగ, శబ్దం తక్కువ చేసినప్పటికీ వీటి నుంచి వెలువడే అల్ట్రాఫైన్ పార్టికల్స్ ఊపిరితిత్తులు, రక్తంలోకి చేరే ప్రమాదముందని చెబుతున్నారు. ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.

News October 16, 2025

రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధం: రోహత్గీ

image

‘ఓటుకు నోటు’ కేసులో నిందితులు రేవంత్, సండ్ర వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. రేవంత్‌పై ACB కేసు చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది రోహత్గీ పేర్కొన్నారు. FIR నమోదవ్వకముందే ఉచ్చు పన్ని కేసు పెట్టడం అన్యాయమన్నారు. ACB సెక్షన్ల ప్రకారం లంచం తీసుకోవడం మాత్రమే నేరమని వాదించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రేపు కూడా విచారణ కొనసాగనుంది.

News October 16, 2025

మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారు: బన్నీ వాసు

image

టికెటింగ్ సంస్థ బుక్ మై షో సంస్థపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు అసహనం వ్యక్తం చేశారు. వారి యాప్, సైట్‌లో సినిమాలకు అసలు రేటింగ్స్ ఎందుకని ప్రశ్నించారు. ‘జర్నలిస్టులు నిర్మాణాత్మక రివ్యూలు ఇస్తున్నారు కదా. మరి మీ రేటింగ్స్‌తో పనేముంది. అసలు సినిమా టికెట్ కొనే సమయంలో ఈ మూవీ బాగుంది, ఇది బాలేదు అని రేటింగ్ ఇవ్వడమేంటి? మీరు కూడా సినిమా మీదే బతుకుతున్నారని గుర్తు పెట్టుకోండి’ అని తెలిపారు.