News July 8, 2024
నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో 4 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు HYD వాతావరణ శాఖ తెలిపింది. నేడు NZB, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, MBNR, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా నిన్న అత్యధికంగా ఆదిలాబాద్(D) చాప్రాలో 4.5cmల వర్షపాతం నమోదైంది.
Similar News
News December 5, 2025
కలెక్టర్ పిలుపు.. ‘3కె రన్ విజయవంతం చేయండి’

భీమవరం పట్టణంలో ట్రాఫిక్‌పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.
News December 5, 2025
ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి: హరీశ్ రావు

TG: బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో <<18478689>>సాయి ఈశ్వర్<<>> బలైపోవడం తీవ్రంగా కలిచివేసిందని హరీశ్‌రావు చెప్పారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు. ‘ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి’ అని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.
News December 5, 2025
CM రేవంత్‌కు సోనియా అభినందన సందేశం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీలకం కానుందని INC పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగమయ్యే వారికి సమ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.


