News August 29, 2025
నేడు 6 జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి, ఏలూరు, ప.గో, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడులో వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.
Similar News
News August 29, 2025
త్వరలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ: మోదీ

భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ విధించిన వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం కొనసాగుతోందన్నారు. ప్రపంచ వృద్ధిలో 18శాతం ఇండియాదేనని పేర్కొన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జపాన్‌లో పర్యటిస్తున్న ఆయన ప్రవాస భారతీయుల సదస్సులో మాట్లాడారు. ఇండియాకు అత్యంత విశ్వసనీయ దేశం జపాన్ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
News August 29, 2025
సంజయ్ కస్టడీ పిటిషన్.. SEP 1న ఉత్తర్వులు

AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ <<17522825>>పోలీస్ కస్టడీపై<<>> విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విని సెప్టెంబర్ 1న ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం వెల్లడించింది. విచారణ కోసం సంజయ్‌ను వారం రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. కాగా అగ్నిమాపక శాఖలో టెక్నాలజీ పేరిట ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ విచారణలో తేలడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది.
News August 29, 2025
ఫుడ్ ప్రాసెసింగ్‌లో అపార అవకాశాలు: చంద్రబాబు

AP: లైవ్ స్టాక్, ఆక్వా కల్చర్ వంటి రంగాల్లో AP అగ్రస్థానంలో ఉందని CM చంద్రబాబు తెలిపారు. ‘ఫుడ్ ప్రాసెసింగ్‌లో వ్యాపారులకు అపార అవకాశాలు ఉన్నాయి. దేశ ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర వాటా 9%(50 బి.డా.)గా ఉంది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం పేరు గాంచింది. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లు అన్వేషిస్తున్నాం. వ్యవసాయం నుంచి 35 శాతం GSDP వచ్చే ఏకైక రాష్ట్రం మనది’ అని తెలిపారు.