News November 21, 2024
26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు: APSDMA

AP: హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో 23న అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. 26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. వరి కోతలు, వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News December 3, 2025
IPL-2026: వీరిలో ఎవరిని మిస్ అవుతారు?

ఫారిన్ ప్లేయర్లు రసెల్, డుప్లెసిస్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించగా మరో ప్లేయర్ మ్యాక్స్వెల్ వచ్చే సీజన్కు అందుబాటులో ఉండట్లేదని అనౌన్స్ చేశారు. తమదైన ఆటతో మ్యాచు స్వరూపాన్నే మార్చేయడంలో వీరు దిట్ట. స్థిరత్వానికి డుప్లెసిస్ మారుపేరు కాగా, ఆల్రౌండర్ కోటాలో మ్యాక్సీ, రసెల్ రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీరి స్థానాలను ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం కష్టమే. మీరు వీరిలో ఎవరి ఆట మిస్ అవుతారు? కామెంట్.
News December 3, 2025
పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.
News December 3, 2025
19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్

సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్తోపాటు అన్ని ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ల స్వీకరణను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. అఫ్గానిస్థాన్, సోమాలియా సహా 19 నాన్ యూరోపియన్ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేషనల్ సేఫ్టీ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. US నేషనల్ గార్డుపై అఫ్గానిస్థాన్ పౌరుడు దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.


