News September 19, 2025

రేపు రాయలసీమలో భారీ వర్షాలు: APSDMA

image

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది.

Similar News

News September 20, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* నో ఫ్లై జోన్‌గా TG సెక్రటేరియట్‌‌.. ప్రకటించిన ప్రభుత్వం. చుట్టూ సైన్ బోర్డుల ఏర్పాటుకు ఆదేశం.
* TG PGEC/TS PGECET-2025 చివరి విడత షెడ్యూల్ విడుదల. ఈనెల 20-25 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, 28-30 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.
* విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 23న గం.10AM నుంచి గ్రూప్-2 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్: APPSC
* పల్నాడు(D) మాచర్లలో రేపు CM చంద్రబాబు పర్యటన.

News September 19, 2025

వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తా: ట్రంప్

image

భారత్‌తో వైరం పెంచుకుంటున్న ట్రంప్.. చైనాతో స్నేహం కోరుకుంటున్నారు. 3 నెలల తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని, టిక్‌టాక్ డీల్‌కు ఆమోదం లభించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక వచ్చేనెల సౌత్ కొరియాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకానమిక్ కో-ఆపరేషన్ సమ్మిట్‌లో జిన్‌పింగ్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు.

News September 19, 2025

లిక్కర్ స్కాం కేసు: వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు

image

AP: లిక్కర్ స్కాం కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు ఈడీ, మరోవైపు సిట్ నిందితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ జగన్ సమీప బంధువుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ అనిల్‌కు సంబంధించిన కంపెనీలు, ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. హైదరాబాద్, చెన్నైలోని సంస్థల్లో తనిఖీలు చేసింది. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.