News September 20, 2025
ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

AP: రాయలసీమలో ఇవాళ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, శ్రీకాకుళం, VZM, అల్లూరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. SEP 26న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.
Similar News
News September 20, 2025
ఇండియన్ల వద్దే 72శాతం H1B వీసాలు

అమెరికా ప్రభుత్వం జారీచేసే H1B వీసాలు అత్యధికంగా ఇండియన్ల వద్దే ఉన్నాయి. FY2022 వరకూ జారీచేసిన వాటిల్లో భారతీయుల వద్ద 72.6శాతం.. అంటే 3,20,791 వీసాలు ఉండటం గమనార్హం. ఆ తర్వాత చైనాకు చెందిన 55,038(12.5%) మంది వద్ద H1B వీసాలున్నాయి. అలాగే కెనడా వద్ద ఒక శాతం(4,235), సౌత్ కొరియా వద్ద 0.9శాతం(4,097) ఉండగా, ఫిలిప్పీన్స్ ప్రజలు 0.8శాతం (3,501) వీసాలు కలిగిఉన్నారు.
News September 20, 2025
క్లీనింగ్ ప్రొడక్ట్స్‌తో ఊపిరితిత్తులపై ప్రభావం: స్టడీ

ఇంటిని శుభ్రం చేసేందుకు వాడే ప్రొడక్ట్స్ లంగ్స్‌ను సైలెంట్‌గా డ్యామేజ్ చేస్తాయని తాజా పరిశోధనలో తేలింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో ప్రచురించిన ఈ పరిశోధనలో 6వేల మంది పాల్గొన్నారు. బ్లీచ్, అమ్మోనియా తదితర క్లీనింగ్ ఉత్పత్తుల్లోని రసాయనాల వల్ల శ్వాసకోశ సమస్యలొస్తాయని, ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని తేలింది. ఇది స్మోకింగ్ వల్ల వచ్చే ప్రమాదంతో సమానం అని పేర్కొంది.
News September 20, 2025
J&Kలో ఎదురుకాల్పులు.. ఆర్మీ ట్రాప్‌లో టెర్రరిస్టులు!

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఇవాళ ఉదయం ఆర్మీ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ జవానుకు గాయాలు కాగా 3-4 మంది టెర్రరిస్టులు భద్రతా దళాల ట్రాప్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్, కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అటు కిష్త్‌వాడ్‌లోనూ నిన్న రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి.