News October 25, 2025
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పలు మార్పుల తర్వాత ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News February 20, 2026
X-Men నటుడు డేన్ కన్నుమూత

హాలీవుడ్ నటుడు ఎరిక్ డేన్ (53) కన్నుమూశారు. Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధితో బాధపడుతూ మరణించారు. డేన్.. X-Men, వాలంటైన్స్ డే, బ్యాడ్ బాయ్స్, మార్లీ & మీ, తదితర సినిమాల్లో నటించారు. అతడి Grey’s Anatomy, Euphoria టీవీ సిరీసులు ఎంతో ఫేమస్. కాగా ASLతో కండరాలు బలహీనపడతాయి. ఆహారం మింగలేరు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణం లేదు. దీనికి నివారణ లేదు.
News February 20, 2026
యాక్సెంచర్ కొత్త రూల్: AI వాడితేనే ప్రమోషన్.. లేదంటే నో ఛాన్స్!

ప్రమోషన్ కావాలంటే కంపెనీకి చెందిన AI టూల్స్ వాడటం తప్పనిసరని యాక్సెంచర్ తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లు తమ రోజువారీ పనిలో AI టూల్స్ వాడుతున్నారో లేదో HR విభాగం ఇకపై నిశితంగా గమనించనుంది. ఇందుకోసం వారు వారానికి ఎన్నిసార్లు లాగిన్ అయ్యారో ట్రాక్ చేస్తోంది. AIకి అలవాటు పడని వారు కంపెనీ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని గతంలోనే CEO జూలీ స్వీట్ హెచ్చరించారు.
News February 20, 2026
ముడతలను ఇలా తగ్గించుకోండి

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్C, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.


