News March 17, 2024

రాష్ట్రంలో భారీ వర్షాలు

image

రేపటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 21 వరకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది.

Similar News

News November 21, 2025

సిటీలో మరో ఉపఎన్నిక.. 3 రోజుల తర్వాత క్లారిటీ!

image

సిటీలో మరో ఉపఎన్నిక రానుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పార్టీ మార్పుపై స్పీకర్‌కు సమాధానం ఇవ్వలేదు. కాగా దానం‌కు స్పీకర్ 3రోజులు గడువిచ్చారు. ఈలోపు ఆయన నుంచి స్పందనరాకపోతే ‘అనర్హత’పై స్పీకర్ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక్కడ ఉపఎన్నిక ఖరారైనట్లే.

News November 21, 2025

OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్‌గా పంత్

image

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్‌గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.

News November 21, 2025

ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

image

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.