News September 1, 2024
రాష్ట్రంలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

APలో భారీ వర్షాలు పలు చోట్ల విషాదం నింపాయి. నిన్న విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ, లాలూ పుర్కాయిత్, సంతోష్ ఉన్నారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. గుంటూరు(D) ఉప్పలపాడులో వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోవడంతో టీచర్ రాఘవేంద్ర, విద్యార్థులు మాన్విక్, సౌరిశ్ మృతిచెందారు. మంగళగిరి గండాలయపేటలో కొండచరియలు విరిగిపడి నాగరత్నమ్మ చనిపోయింది.
Similar News
News January 11, 2026
పంచె కట్టు నచ్చట్లేదు.. భర్తకు విడాకులిచ్చేస్తా!

భోపాల్లో ఫ్యామిలీ కోర్టుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. భర్త పౌరోహిత్యం చేస్తూ కష్టపడి చదివించి తన భార్యను SI చేశారు. తీరా ఆమె పోలీస్ ఉద్యోగం సంపాదించాక ఇప్పుడు భర్త నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కారు. భర్త ధోతీ కుర్తా ధరించడం, పిలక ఉంచుకోవడం తనకు నచ్చడం లేదని అది తన హోదాకు అవమానంగా ఉందని వాదిస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.
News January 11, 2026
ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.
News January 11, 2026
మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు

TG: మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. TTD కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.


