News August 29, 2024
రాష్ట్రంలో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో ఈ నెల 30, 31తో పాటు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల్, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, HYD, మేడ్చల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తాయంది.
Similar News
News November 24, 2025
HYD: జాతీయ శిక్షణకు బాలికలకు అవకాశం

రంగారెడ్డి జిల్లాలో 12-16 ఏళ్ల బాలికల కోసం ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 60M, 600M, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో, షాట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 28న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉ.8 గం.కు రిపోర్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. జిల్లా స్థాయిలో అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయి క్యాంపులో ప్రత్యేక శిక్షణ లభిస్తుంది.
News November 24, 2025
అధిక ధరలకు అమ్మితే కాల్ చేయండి!

బస్స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, సూపర్ మార్కెట్స్ వంటి చోట్ల కొందరు MRP కంటే అధిక ధరలకు వస్తువులు అమ్ముతుంటారు. అలాంటి సమయంలో ప్రశ్నించడం వినియోగదారుడిగా నీకున్న హక్కు. ఒకవేళ ఎవరైనా అధిక ధర వసూలు చేస్తే అది చట్ట ప్రకారం నేరం. ఇలాంటి మోసాలను వెంటనే నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నం.1915కు కాల్ లేదా WhatsApp No 8800001915కు మెసేజ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. SHARE IT
News November 24, 2025
CBN కోసం పవన్ డైవర్షన్ పాలిటిక్స్: అంబటి

AP: తిరుమల <<18376126>>లడ్డూ వివాదం<<>>పై Dy.CM పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజాగ్రహం నుంచి చంద్రబాబును కాపాడేందుకు పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర, నష్టపరిహారం కోసం పోరాడాల్సిందిపోయి.. పొలిటికల్ డ్రామాలోకి తిరుమలను, లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చారు. తప్పుడు ప్రచారం, ప్రజలను నమ్మించడంలో CBN, పవన్ నిపుణులు. గోబెల్స్‌ను మించిపోయారు’ అని ఫైరయ్యారు.


