News August 17, 2024
నేడు ఈ 7 జిల్లాల్లో భారీ వర్షాలు!

TG: ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంది. నిన్న HYD సహా కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో జోరు వాన పడింది. కుమురంభీం(D) ఆసిఫాబాద్(M) చోర్పల్లిలో పిడుగుపాటుతో అంజన్న(20) మృతి చెందారు.
Similar News
News November 12, 2025
మదనపల్లి కిడ్నీ రాకెట్.. నిందితులపై కేసు

APలో సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఆసుపత్రి యజమాని డా.ఆంజనేయులు, మరో వైద్యుడితో పాటు బ్రోకర్లు పద్మ, సత్యలపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసు ఫైల్ చేశారు. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుతో కిడ్నీ రాకెట్ బయటపడింది. పద్మ, సత్య డబ్బు ఆశ చూపి అమాయకులను కిడ్నీ మార్పిడి దందాలోకి దింపుతున్నారు. యమునను కూడా తీసుకొచ్చి కిడ్నీ తొలగిస్తుండగా మరణించింది.
News November 12, 2025
సికింద్రాబాద్లోని NIEPMDలో ఉద్యోగాలు

సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<
News November 12, 2025
అయ్యప్ప మాల ఎవరు ధరించకూడదు?

తల్లిదండ్రులు మరణించినప్పుడు పన్నెండు నెలలు సూతకం కారణంగా దీక్షను, యాత్రను విరమించాలి. ఇంట్లో నూతన శిశువు జన్మించినా లేదా స్త్రీలు ఏడో నెల గర్భవతులైనా పురుషులు దీక్ష తీసుకోకూడదు. అనుకోని అశుభాలు సంభవిస్తే దీక్ష విరమించి, తిరిగి దీక్ష చేయాలనుకుంటే 41 రోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి. స్త్రీలలో 10 ఏళ్లలోపు బాలికలు, రుతుక్రమం కానివారు, రుతుక్రమం ఆగిపోయినవారు మాత్రమే దీక్షకు అర్హులు. <<-se>>#AyyappaMala<<>>


