News September 23, 2025
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.
Similar News
News September 23, 2025
నేడు ‘ముద్దపప్పు బతుకమ్మ’.. ఎలా చేస్తారంటే?

తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగ మూడో రోజుకి చేరుకుంది. ఇవాళ ‘ముద్దపప్పు బతుకమ్మ’ను 3 వరుసల్లో చామంతి, మందార, రామబాణం పూలతో పేరుస్తారు. పసుపుతో గౌరమ్మను తయారుచేసి ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. సాయంత్రం మహిళలు, పిల్లలు పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత ఇతరులకు ప్రసాదం పంచిపెడతారు. ఆపై బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.
News September 23, 2025
CELలో 46 పోస్టులు

ఘజియాబాద్‌లోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(CEL) 46 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు ఈ నెల 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.celindia.co.in/
News September 23, 2025
గులాబీ తోటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి?

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.